![]() |
![]() |

బిగ్ బాస్ సీజన్-7 నిన్నటి వరకు టాస్క్, ఎలిమినేషన్, నామినేషన్ అంటు ఆకట్టుకుంది. ఇప్పుడు ఫ్యామిలీ వీక్ మొదలైంది. ఒక్కో కంటెస్టెంట్ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ హౌస్ లోకి వస్తుంటే వాళ్ళ మధ్య బాండింగ్ అంతా బిగ్ స్క్రీన్ పై చూస్తూ ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతారు. అందుకనే ఫ్యామిలీ వీక్ కి ఇంత క్రేజ్. అయితే తాజాగా విడుదలైన బిగ్ బాస్ ప్రోమో మరింత ఆసక్తిగా ఉంది.
ఫ్యామిలీ వీక్ లో భాగంగా మొదటగా శివాజీ కొడుకు బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చినట్లు ప్రోమోలో చూపించారు. తాజాగా అంబటి అర్జున్ భార్య సురేఖ బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చినట్లు మరో ప్రోమో రిలీజ్ చేశారు. తను వచ్చీ రాగానే హౌస్ మేట్స్ అంతా షాక్ అయ్యారు. ముఖ్యంగా అంబటి అర్జున్ సురేఖను చూడగానే ఎమోషనల్ అయ్యాడు. ఆ తర్వాత కాసేపు ఇద్దరు ఎమోషనల్ అయ్యారు. నిన్ను చాలా మిస్ అవుతున్నానని అర్జున్ తో సురేఖ అంది. ఆ తర్వాత హౌస్ లో ఎవరెలా ఉంటున్నారు? బయట ఎలా ఉందని హౌస్ మేట్స్ అడుగగా.. ఏమో గుర్తులేదు. మర్చిపోయా అని సురేఖ కామెడీ చేసింది. దాంతో హౌస్ మేట్స్ అంతా నవ్వుకున్నారు. కాసేపటికి అంబటి అర్జున్-సురేఖ దంపతులిద్దరు సపరేట్ గా మాట్లాడుకున్నారు.
నువ్వు గేమ్స్ ఆడుతున్నావ్ కానీ హౌస్ మేట్స్ తో సరిగ్గా ఉండటం లేదని, సరిగ్గా రియాక్ట్ అవ్వడం లేదని సురేఖ అంది. ఇద్దరు కాసేపు ఎమోషనల్ అయ్యారు. సురేఖ మిస్ అవుతున్నానని అనగానే.. అంబటి అర్జున్ కన్నీళ్ళు పెట్టుకున్నాడు. ఇక హౌస్ లో సురేఖ శ్రీమంతం కూడా చేసినట్టు తెలుస్తుంది. ఇది బిగ్ బాస్ సీజన్-7 లోనే మోస్ట్ ఎమోషనల్ ఎపిసోడ్ అవుతుంది. కాగా ఇప్పుడు ఈ బిగ్ బాస్ ప్రోమో యూట్యూబ్ లో ఫుల్ ట్రెండింగ్ లో ఉంది.
![]() |
![]() |